Sunday, May 2, 2021

How to use mobile to improve your Vocabulary? మొబైల్ ఫోన్ ని ఉపయోగించుకుని పదసంపదను ఎలా పెంపొందించుకోవాలి?

 How to use mobile to improve your Vocabulary?

మొబైల్ ఫోన్ ని ఉపయోగించుకుని పదసంపదను ఎలా పెంపొందించుకోవాలి?

Vocabularyని పెంపొందించుకోడానికి ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో ఒకటి మొబైల్ ను ఉపయోగించి నేర్చుకోవడం. మన చేతిలోని సెల్ ఫోన్ ఒక మినీ కంప్యూటర్ లాంటిది. మొబైల్ ఫోన్ లో ఎన్నో ఫీచర్లు, యాప్ లు ఉంటాయి. వాటిలో Vocabularyని నేర్చుకోడానికి అవసరమైన పదింటి గురించి తెలుసుకుందాం.   
 

1.Google Chrome

2. Notes / S Memo

3. Reminder

4. G-Board

5. Whatsapp

6. Audio Books

7. Recorder

8. Video Camera

9. Gmail/Google Drive

10.Youtube 

1.Google Chrome : డెస్క్ టాప్ లో ఎలాగైతే టాపిక్స్ కోసం, పదాల అర్థాల కోసం గూగుల్ సర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ లో వెతుకుతామో... మొబైల్ లోనూ గూగుల్ క్రోమ్ ను అలాగే వాడుకోవచ్చు. మనం ఏవైనా పుస్తకాలు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడుగానీ, టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నప్పుడుగానీ కొత్త కొత్త పదాలు వస్తుంటాయి. వాటికి వెంటనే అర్థం తెలుసుకోవాలంటే డిక్షనరిలో చూడడం అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే వెంటనే గూగుల్ క్రోమ్ లో కొత్త పదాన్ని టైప్ చేసి దాని పక్కన meaning అని టైప్ చేయాలి. Ex : Beauty meaning అని టైప్ చేయగానే వెంటనే కొన్ని కీవర్డ్స్ లిస్ట్ వస్తుంది. అందులో మనకు కావల్సిన beauty meaning in telugu అనేదాన్ని సెలెక్ట్ చేసుకుని సర్చ్ చేస్తే చాలు వెంటనే 'అందం' అనే అర్థం కనిపిస్తుంది. అర్థంతోపాటు కొత్త పదం spelling కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాదు... ఆ పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తారో కూడా తెలుసుకోవాలి. అందుకోసం గూగుల్ క్రోమ్ లోనే మనకు కావల్సిన wordని టైప్ చేసి దాని పక్కనే pronunciation అని టైప్  చేయాలి. Ex : beauty pronunciation అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఒక ఆడియో సింబల్, దాని పక్కనే mouth సింబల్ ప్రత్యక్షమవుతాయి. ఆడియో సింబల్ పై ప్రెస్ చేయగానే ఆ పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తారో వాయిస్ వినిపిస్తుంది. అర్థం, ఉచ్ఛరణలతోపాటే గ్రామర్ ను కూడా తెలుసుకోవచ్చు. అంటే ఆ పదం Noun / Verb అనేది కూడా తెలిసిపోతుంది. అందుకోసం మనం Ex : beauty grammar అని సర్చ్ చేయాలి. 



      

2. Notes / S Memo : కొన్నిసార్లు మనం కొత్త పదాలకు వెంటనే అర్థం కోసం గూగుల్ క్రోమ్ లో సర్చ్ చేసే వీలు లేకపోవచ్చు. దానికి రకరకాల కారణాలుండొచ్చు. నెట్ సరిగా పనిచేయకపోవడం, టైం లేకపోవడం వల్ల ఆ పదాలను అంతటితో వదిలేస్తాం. అలా కాకుండా కొత్త పదాలను మన మొబైల్ ఫోన్ లోనే save చేసుకునే వీలుంది. అందుకోసం Notes / S Memoను ఉపయోగించుకోవాలి. కొన్ని ఫోన్లలో Notes ఉంటే మరికొన్నింటిలోS Memo ఉంటుంది. అందులో పదాన్ని టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. వీలైనప్పుడు ఆ పదానికి అర్థం తెలుసుకోవచ్చు.

3. Reminder : మనం Notes / S Memoలో సేవ్ చేసుకున్నాసరే కొన్నిసార్లు మరిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం Reminderని వాడుకోవాలి. Notesలో ఒక పదాన్ని సేవ్ చేసిన తర్వాత పైన మూడు నిలువు చుక్కలు కనిపిస్తాయి. వాటిని ప్రెస్ చేస్తే రిమైండర్ తోపాటు మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. రిమైండర్ ను సెలెక్ట్ చేసుకుంటే కింద Date, time వస్తాయి. మనం ఫ్రీగా ఉండే టైంను ఎంచుకుని Reminderని సెట్ చేసుకుంటే ఆ సమయానికి అలారం మోగుతుంది. అప్పుడు కొత్త పదానికి డిక్షనరిలోగానీ, ఆన్ లైన్ డిక్షనరిలోగానీ అర్థం వెతుక్కోవచ్చు. 

4. G-Board : Notesలో సేవ్ చేసుకున్న పదాలకు తెలుగులో అర్థాలను కూడా రాసుకోవచ్చు. అందుకోసం తెలుగు టైపింగ్ టూల్ అవసరం అవుతుంది. ఎన్నో టైపింగ్ టూల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి Gboard. ఈ మల్టీ లింగువల్ టైపింగ్ టూల్ ను గూగుల్ డెవలప్ చేసింది. Google Play store నుంచి download చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. Whatsappలోకి వెళ్లి దీని సెట్టింగ్స్ ని మార్చుకోవచ్చు. ఈ ఒక్క టైపింగ్ టూల్ తో Notes, Whatsapp, Facebook తదితరవాటిలో తెలుగులోనూ టైప్ చేసుకోవచ్చు. 

5. Whatsapp : Vocabularyని నేర్చుకోవాలనుకునే తపన ఫ్రెండ్స్, బంధువుల్లో కొందరికి ఉండొచ్చు. అలాంటి వారిని గుర్తించి Whatsappలో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. మనం నేర్చుకున్న పదాలను మిగతావారికి షేర్ చేస్తే... వాళ్లు నేర్చుకున్నవి మనకు పంపిస్తారు. ఇలా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ కొత్త పదాలను నేర్చుకునే వీలుంటుంది.  

 6. Audio Books : కొత్త కొత్త పదాలు నేర్చుకోడానికి ఉపయోగపడేవి ఆడియో బుక్స్. వీటి ద్వారా English languageని నేర్చుకోవచ్చు. ఇంతకుముందైతే నవలలు, పుస్తకాలు, మ్యాగజైన్లు, మాసపత్రికలు జనం ఎక్కువగా చదివేవారు. కానీ మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత అంతా ఆన్ లైన్ కే అడిక్ట్ అయ్యారు. చాలామంది పుస్తకాలు చదవడం మానేశారు. ప్రతి విషయానికి గూగుల్ తల్లిపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఆడియో బుక్స్ వచ్చేశాయి. Google Chromeలో Free audio books అని సర్చ్ చేయగానే పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది. మనకు అవసరమైనవాటిని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫ్రీటైంలో వాటిని వినొచ్చు. లేదంటే ఆడియో బుక్స్ ని మన మొబైలో ప్లే చేసి వాటిని వింటూ ఎంచక్కా మన పనులు మనం చేసుకోవచ్చు. కొత్తగా అనిపించిన పదాలకు వెంటనే అర్థాలు తెలుసుకుంటే Vocabulary improve అవుతుంది. అదే టైంలో English languageపై పట్టు వస్తుంది. 

7. Recorder : మొబైల్ లో ఉండే ఫీచర్లలో ఒకటి ఆడియో రికార్డర్. మనం నేర్చుకునే కొత్త పదాలను ఇందులో రికార్డ్ చేసుకుని దాచుకోవచ్చు. వీలైనప్పుడు వింటూ ఉంటే పదేపదే గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. తద్వారా వాటిని మనం మర్చిపోలేము. అంతేకాదు మన ఉచ్చరణ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. ఎక్కడైనా సరిగా ఉచ్చరించలేదనిపిస్తే మెరుగుపరుచుకునే వీలుంటుంది. 

8. Video Camera : మొబైల్ లో ఉండే ఫీచర్లలో మనం ఎక్కువగా వాడే వాటిలో ఒకటి వీడియో కెమెరా. కేవలం ఏవేవో వీడియోలు తీసుకోడానికే కాకుండా... Vocabularyని improve చేసుకోడానికి కూడా వాడుకోవచ్చు. అదేలాగంటే మనం నేర్చుకున్న పదాలను బిగ్గరగా ఉచ్చరిస్తూ వీడియో కెమెరాతో రికార్డ్ చేయాలి. వాటిని ప్లే చేసుకుని చూస్తే మన ముఖకవళికలు ఎలా ఉన్నాయి. సరిగా ఉచ్చరిస్తున్నామా లేదా అనేది తెలిసిపోతుంది. ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం సమీక్షించుకోవడమే.        

9. Gmail/Google Drive : మనం నేర్చుకున్న కొత్త కొత్త అర్థాలను ఇతరులకు పంపించాలన్నా, చాలా కాలం దాచుకోవాలన్నా మనకు ఉపయోగపడేవి Gmail మరియు Google Drive. మన మొబైల్ లో స్టోరేజీ ఫుల్ అయితే కొన్ని వీడియోలు, ఫొటోలను డిలీట్ చేయక తప్పదు. అంటే వాటిని మనం కోల్పోవల్సి వస్తుంది. అలా కాకుండా వాటిని మనం ఆన్ లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు. Gmail అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ Google వాళ్లు 15 GB ఫ్రీ స్పేస్ ఇస్తున్నారు. అయితే ఇది Gmail మరియు Google Driveకు కలిపి ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న పదాలను Gmail ద్వారా ఇతరులకు పంపించొచ్చు. మన వీడియోలు, ఫొటోలు, మిగతా డాక్యుమెంట్లను Google Driveలో దాచుకోవచ్చు. Gmail ఐడీ మరియు passwordతోనే Google Driveని లాగిన్ అవ్వొచ్చు. అంతేకాదు Gmail ఐడీ మరియు passwordతోనే Youtubeతో సహా చాలా Google productsలో లాగిన్ అవ్వొచ్చు. Google Driveలో స్టోర్ చేసుకున్నవాటిని ప్లే చేసుకుని మళ్లీ మళ్లీ వినొచ్చు. 

10.Youtube : దీని గురించి ప్రపంచంలో తెలియనివారు లేరంటే అతిశయోక్తికాదు. చిన్న పిల్లలు కూడా మొబైల్ తీసుకుని వాళ్లే స్వయంగా Youtubeని ఓపెన్ చేసి వీడియోలు చూస్తుంటారంటే అది ఎంత ఫేమసో అర్థమవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే సమాచారం, విద్య, వినోదం కోసం యావత్ ప్రపంచం యూట్యూబ్ పై ఆదారపడుతోంది. Youtubeలో పాఠాలు నేర్చుకోవడంతోపాటు Vocabularyని కూడా improve చేసుకోవచ్చు. అదెలాగంటే Google Chromeలో ఎలాగైతే pronunciation కోసం వెతుకుతామో... వాటిని Youtubeలోనూ సర్చ్ చేయొచ్చు. Ex : beauty pronunciation అని సర్చ్ చేయగానే అందుకు సంబంధించిన రకరకాల వీడియోలు ప్రత్యక్షమవుతాయి. వీడియో ప్లే చేయగానే ఆ పదాన్ని ఎలా ఉచ్చరిస్తారో వాయిస్ వినిపిస్తుంది. English language నేర్చుకోడానికి Youtube మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.  


Sunday, May 17, 2020

5 Tips to Increase Your Vocabulary in Telugu | Learn English Vocabulary...

5 టిప్స్ పాటిస్తే Vocabulary ని పెంపొందించుకోవచ్చు. Spellingని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
అవేంటో ఈ వీడియో పూర్తిగా చూడండి.












Tuesday, May 5, 2020

Verb and Forms of Verb in Telugu | Regular and Irregular Verbs




క్రియ  ప్రధానంగా ఎన్ని రూపాల్లో ఉంటుందో... అవేంటో తెలుసుకోవాలంటే ీఈ వీడియో చూడండి.










Sunday, April 5, 2020

Let us light Diyas tonight at 9 pm | Light diyas to eradicate Coronavirus

Sunday, January 26, 2020

3 tips for spoken english | ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడడానికి 3 టిప్స్

ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే చాలమందికి అదో భయం. ఆ భయాన్ని ఎలా అధిగమించాలి? ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా ప్రాక్టీస్ చేయాలి? వీటికి సంబంధించిన మూడు టిప్స్ ను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.












Friday, November 15, 2019

Present Continuous Tense | ఏయే Special verbs వాడాలి | ఎలాంటి Main verb వ...

Present Tenseలోని నాలుగు Aspectలలో ఒకటి Present Continuous Tense. ఇందులో ఏయే Special verbs

వాడాలి. ఎలాంటి Main verbs వాడాలి. ఎలాంటి Verbs ఇందులో వాడకూడదు. మినహాయింపులు ఏంటో

తెలుసుకుందాం. 






Tuesday, September 3, 2019

Simple Present Tense | ఏయే verbsకు es చేరుతుంది ఎలాంటి verbsకు s చేరుతుంది

Simple Present Tense | ఏయే verbsకు es చేరుతుంది ఎలాంటి verbsకు s చేరుతుంది

Simple Present Tenseలో ఎలాంటి Helping verbs లేదా Special verbs వాడాలి? Third person singularలో ఏయే base verbsకు -s చేరుతుంది? ఏయే base verbsకు -es చేరుతుంది? ఏయే  సందర్భంలో Simple present tense వాడుతాం? వీటి గురించి తెలుసుకోవాలంటె ఈ వీడియో చూడండి.



Thursday, July 25, 2019

ఏయే Tenseలో ఎలాంటి Verb form వాడాలి?

TENSE - కాలం

3 Tenses + 5 Verb forms

   చాలా మంది గ్రామ‌ర్ అంటే బోర్ కొడుతుందంటారు. భ‌య‌ప‌డుతుంటారు. నేర్చుకోవడం చాలా క‌ష్టంగా ఉంటుంద‌ని, గ్రామ‌ర్ రూల్స్ క‌ఠినంగా ఉంటాయ‌ని టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఇంకొంద‌రు త‌ప్ప‌దు కాబ‌ట్టి నేర్చుకోవాల‌ని బ‌ట్టీ ప‌డుతుంటారు. స్కూల్లో ఇలాంటివే కామ‌నే. కానీ బ‌ట్టీ ప‌ట్ట‌డం వ‌ల్ల ఉప‌యోగం లేదు. అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటే గ్రామ‌ర్‌ను చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అదెలాగో చ‌ద‌వండి. ఇందులో ఉన్న వీడియోను కూడా చూడండి.
Tense | Present | Past | Future | Verb forms



Example : 1


1.He works hard.
         ------
2.He is working hard.
         ------------
3.He has worked hard.
        --------------
4.He worked hard.
         --------
5.He will work hard.
        ------------

Example : 2 


1.I write a letter.
      ------
2.I am writing a letter.
     -------------
3.I have written a letter.
     ---------------
4.I wrote a letter.
      ------
5.I shall write a letter.
     ------------
      
     ఈ వాక్యాలను చదవంఢి. వీటిలో తేడా ఎక్కడుంది. Underline చేసిన పదాల్లోనే తేడా ఉంది. Work, write
అనేవి verbs. ఇక్కడ work, write అనేవి రెండు పనులు చేస్తున్నాయి. ఒకటి work అంటే చేసే పనిని తెలుపుతుంది. రెండోది timeని సూచిస్తుంది. ఈ timeని చెప్పడాన్నే మనం Tense అంటాం. Latin పదం Tempus అంటే Time. అక్కడి నుంచి వచ్చిందే ఇది.

1.He works hard.
     --------
2.He worked hard.
      --------
3.He will work hard. 
     ------------

Underline చేసిన పదాలను మరోసారి చదవండి. Work, write అనే క్రియ‌లు ఎలా రూపాంత‌రం చెందాయో గ‌మ‌నించారు క‌దా! అంటే జ‌రుగుతున్న ప‌నిని బ‌ట్టి ఒక్కో tense 4 భాగాలుగా విడిపోయింది. దీన్నే మ‌నం    Aspect  అంటాం.

He works hard.
He is working hard.
He has worked hard.
He has been working hard.

   ఇవ‌న్నీ కూడా Present Tense. కానీ ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌నితీరును సూచిస్తున్నాయి. అంటే ప్ర‌తి tenseలో కామ‌న్‌గా 4 Aspects  ఉంటాయి. 
అవి.
1.Simple
2.Continuous
3.Perfect
4.Perfect Continuous

వీటిని మూడు tenseల‌కు అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి.

Present Tense :

1.Simple Present Tense
2.Present Continuous Tense
3.Present Perfect Tense
4.Present Perfect Continuous Tense 
            

Past Tense :

1.Simple Past Tense
2.Past Continuous Tense
3.Past Perfect Tense
4.Past Perfect Continuous Tense

Future Tense : 

1.Simple Future Tense
2.Future Continuous Tense
3.Future Perfect Tense
4.Future Perfect Continuous Tense

ఇప్పుడు వీటికి ఉదాహ‌ర‌ణ‌లు చూద్దాం. 

Present Tense : 

1.I write a letter. -Simple Present 
2.I am writing a letter. -Present Continuous Tense
3.I have written a letter. -Present Perfect Tense
4.I have been writing a letter. -Present Perfect continuous Tense 
                   

Past Tense :

1.I wrote a letter. -Simple Past Tense 
2.I was writing a letter. - Past Continuous Tense
3.I had written a letter. -Past Perfect Tense
4.I had been writing a letter. -Past Perfect Continuous Tense

Future Tense : 

1.I shall write a letter. -Simple Future Tense 
2.I shall be writing a letter. -Future Continuous Tense
3.I shall have written a letter. -Future Perfect Tense
4.I shall have been writing a letter. -Future Perfect Continuous Tense 
Tense స‌రే ఒక వాక్యం ఏ tenseలో ఉందో ఎలా తెలుస్తుంది? క్రియ‌ను బ‌ట్టే ఆ వాక్యం ఏ tenseలో ఉందో తెలుసుకోవ‌చ్చు. 
Ex : works - Simple Present
        worked - Simple Past
      is writing -Present Continuous
     has written -Present Perfect
     will work -Simple Future 

వీటిని గ‌మ‌నిస్తే ఒకే క్రియ 5 ర‌కాలుగా రూపాంత‌రం చెందింద‌ని అర్థ‌మ‌వుతుంది.

V1                  V2                   V3                   V4              V5
Present        Base verb       Present              Past            Past
verb              + s, es           participle           verb          participle 
-----             -----------       -----------           ------         -----------
work           works            working              worked      worked 
write          writes            writing               wrote          written
go               goes               going                 went             gone 
speak        speaks            speaking             spoke          spoken 

వీటిని మీరు స్కూల్లో చ‌దువుకున్న తీరు గుర్తుంది క‌దా! 
work    worked  worked
write    wrote      written

ఇలాగే బ‌ట్టీ ప‌ట్టారు క‌దా! ఇక్క‌డ చాలా మంది చేసే పొర‌పాటేంటంటే వీటిని Present tense, Past tense, Future tense అనుకుంటారు. కానీ Future tense main verb అనేది లేదు. Present verbకు ముందు will/shall చేరుస్తాం. ఇక్క‌డ మీరు గుర్తుపెట్టుకోవ‌ల్సిన మ‌రో విష‌యం ఏంటంటే... Present participle and Past participleను మూడు tenseల‌లోనూ వాడుతాం.

Present participle Ex.

1.I am going to school.
2.I was going to school.
3.I shall be going to school.
  

Past participle Ex. 

1.I have finished my home work.
2.I had finished my home work, when you came to me yesterday.  
3.I will have finished my home work by this time tomorrow.

Tense బాగా అర్థం కావాలంటే verb formsని త‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోవాలి. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే verbs అనేవి వేల సంఖ్య‌లో ఉంటాయి. వీలైన‌న్ని ఎక్కువ‌గా గుర్తుపెట్టుకోవాలి. కుద‌ర‌క‌పోతే క‌నీసం మ‌న‌కు రోజువారీగా ఉప‌యోగ‌ప‌డేవాటినైనా గుర్తుంచుకోవాలి. చ‌దివేట‌ప్పుడు కొత్త‌గా అనిపించిన  verbs గురించి Dictionary సాయంతో తెలుసుకోవాలి. 

       మ‌నం ఎక్కువ‌గా వాడే verb forms అన్నీ ఇక్క‌డ చెప్ప‌డం కుద‌ర‌దు. వీటి గురించి తెలుసుకోవాల‌నుకుంటే ఇదే websiteలో verb అనే పేజిలో చూడండి.)

===========



Monday, July 1, 2019

Your's త‌ప్పు. Yours ఒప్పు. Why?

Common mistakes | Your's | English grammar through Telugu

మ‌నం మాట్లాడేట‌ప్పుడుగానీ, రాసేట‌ప్పుడుగానీ కొన్ని త‌ప్పులు చేస్తుంటాం. వాటినే Common mistakes  అంటాం. వీటిని స‌రిదిద్దుకుంటే మ‌న భాష మెరుగుప‌డుతుంది. లేదంటే ఆ త‌ప్పులు అలాగే కంటిన్యూ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి Your's. మీ లేదా మీ యొక్క అనే అర్థంలో వాడుతుంటాం. మ‌రి ఇందులో ఉన్న త‌ప్పేంటో ఈ వీడియో చూడండి. 




Sunday, January 27, 2019

countable nouns | uncountable nouns

Countable Nouns, Uncountable Nouns ఈజీగా గుర్తుప‌ట్ట‌డం ఎలా?
ఒక చోట 10 పెన్నులు ఉన్నాయి. ఆ ప‌క్క‌నే ధాన్యం రాశి ఉంది. రాశిలో ధాన్యాన్ని
లెక్కించ‌డం సుల‌భ‌మా, పెన్నుల‌ను లెక్కించ‌డం ఈజీనా? Countable Nouns,
Uncountable Nounsకు, వీటిని లెక్కించ‌డానికి సంబంధం ఏంటి? ఇది తెలుసుకోవాలంటే
ఈ వీడియో చూడండి. 






Saturday, January 19, 2019

Abstract Nouns

Abstract Nounsని ఎప్పుడు వాడుతాం?

Thursday, January 10, 2019

Simple Present Tenseని ఏయే సంద‌ర్భాల్లో వాడుతారు? | Simple Present Tense

Simple Present Tenseని ఏయే సంద‌ర్భాల్లో వాడుతారు?

Simple Present Tenseని ర‌క‌ర‌కాల సంద‌ర్బాల్లో వాడుతారు. ఈ Tenseని కేవ‌లం వ‌ర్త‌మాన కాలాన్ని సూచించ‌డ‌మే కాకుండా Permanent Timeని కూడా సూచిస్తుంద‌నే విష‌యాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోగ‌లుగుతారు.

Monday, January 7, 2019

Tenseని ఈజీగా నేర్చుకునే టెక్నిక్ | Tense | All Tenses

Tenseని ఈజీగా నేర్చుకునే టెక్నిక్
చాలా మంది Tenses గురించి భ‌య‌ప‌డుతుంటారు. అవి అంత ఈజీగా అర్థం కావ‌నే
అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకో ఈ వీడియో చూడండి.

Saturday, January 5, 2019

English grammar through Telugu | Collective nouns

Common nounకు Collective nounకు మ‌ధ్య తేడా ఏంటి?



Saturday, December 1, 2018

English grammar through telugu | Material nouns


Material Nouns గురించి తెలుసుకోడానికి ఒక నిమిషం చాలు

Tuesday, November 27, 2018

English Grammar through Telugu | Common nouns

Common nounsని అర్థం చేసుకోవ‌డం చాలా ఈజీ





Wednesday, November 21, 2018

English Grammar through Telugu | Kinds of Nouns | Proper Nouns

Proper Noun వాక్యం మ‌ధ్య‌లో వ‌చ్చినా capital letterతోనే మొద‌లు పెట్టాలా?





Saturday, November 10, 2018

Countable Nouns and Uncountable Nouns అంటే ఏంటి?

Countable Nouns, Uncountable Nouns విష‌యంలో చాలా మంది తిక‌మ‌క ప‌డుతుంటారు. కానీ వీటిని అర్థం చేసుకోవ‌డం చాలా ఈజీ. ప్ర‌పంచంలోని వ‌స్తువుల‌ను రెండు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి లెక్కించ‌ద‌గిన‌వి, రెండు లెక్కించ‌లేనివి. వీటి ఆధారంగానే నామ‌వాచ‌కాల‌ను కూడా Countable Nouns లేదా Countables (లెక్కించ‌ద‌గిన‌వి), Uncountable Nouns లేదా Uncountables (లెక్కించ‌లేనివి) అని విభ‌జించారు. 
Ex : మ‌నుషుల‌ను(men) ఒక‌రు, ఇద్ద‌రు, ముగ్గురు ఇలా లెక్కిస్తాం. జంతువులు (Animals), ప‌క్షులు (Birds), చెట్లు(Trees), మొక్క‌ల‌ను(Plants) కూడా ఒక‌టి, రెండు అని లెక్కించొచ్చు. ఒక బ్యాగు (one bag), రెండు క‌ప్పులు (two cups), మూడు పెన్నులు (three pens) ఇలా వ‌స్తువుల‌ను కూడా లెక్క‌పెడ‌తాం. కానీ ఒక పాలు(milk), ఒక నీరు(water), ఒక బంగారం(gold) అని అన‌లేం. ఎందుకంటే వీటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. పాలు, నీళ్ల‌ను లీట‌ర్ల‌లో కొలుస్తాం. బంగారం, వెండిని(silver) గ్రాములు, కిలోల్లో తూకం వేస్తాం. చ‌క్కెర‌ (sugar), బియ్యం (rice), ప‌ప్పుల‌ను(grams) కిలోల్లో బ‌రువును తూకం వేస్తాంగానీ వాటిని లెక్కించ‌డం సాధ్యం కాదు. నేల‌పై ప‌రుచుకున్న బండ‌రాళ్లు (stone), ఇసుక (sand) ఇలాంటివాటిని లెక్కించ‌లేం. 

Countable Nouns లేదా Countables : Ex : man, animal, bird, tree, plant, bag, cup, pen, river, mountain....etc... 

Uncountable Nouns  లేదా Uncountables : Ex : milk, water, gold, ilver, sugar, rice, air, rain, glass, wool, stone, sand....etc...

Uncountablesని కూడా కొన్నిసార్లు Countablesగా వాడ‌తాం. ఉదాహ‌ర‌ణ‌కు waterను లెక్క‌పెట్ట‌లేం, కానీ water drops (నీటి బిందువుల‌ను) లెక్క‌పెట్ట‌గ‌లం. అలాగే ప‌రుచుకుని ఉన్న బండ‌రాళ్ల‌ను లెక్క‌పెట్టలేం. కానీ విడిగా ఉన్న రాళ్ల‌ను లెక్క‌పెట్ట‌గ‌లం. ఉదాహ‌ర‌ణ‌కు ఆ బాలుడు కోతిపైకి రెండు రాళ్లు విసిరాడు.
                              water - uncountable noun

Tuesday, October 23, 2018

Childhood, boyhood అనేవి noun గ్రూప్‌లో ఏ వ‌ర్గానికి చెందుతాయి?

ఇంత‌వ‌ర‌కు మ‌నం కంటితో చూడ‌ద‌గిన‌వి, ట‌చ్ చేయ‌గ‌లిగిన noun గ్రూపుల గురించి తెలుసుకున్నాం. కంటికి
క‌నిపించ‌నివి, కేవ‌లం ఆస్వాదించ గ‌లిగిన‌ నామ‌వాచ‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుణ‌ముల పేర్లు,
స్థితుల పేర్లు, శాస్త్ర‌ములు లేక క‌ళ‌ల పేర్లు ఈ వ‌ర్గంలోకి వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు Childhood, boyhoodనే
తీసుకోండి. ఈ రెండు వ్య‌క్తి జీవితంలోని ప్రారంభ ద‌శ‌లు. మ‌నిషి ఎదుగుద‌ల క‌నిపిస్తుందికానీ... పెర‌గ‌డం
క‌నిపించ‌దు. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాంగానీ చూడ‌లేం. వీటినే Abstract Nouns అంటాం.
An Abstract Noun is usually the name of a quality, action or state అనేది దీని నిర్వ‌చ‌నం. వీటిలో చాలా
వ‌ర‌కు మ‌న భావ‌న‌లే. అంటే వీటిని మ‌నం ఫీల‌వుతాం (ఆస్వాదిస్తాం) కానీ చూడ‌లేం. Abstract Nounsలో 1. 
Qualities (గుణ‌ములు), 2. Action (ప‌ని), 3.State (స్థితి) ఉంటాయి.
Ex :
1. Qualities (గుణ‌ములు) : 
kindness (ద‌య‌ ), hardness (క‌ఠిన‌త్వ‌ము), goodness (మంచిత‌న‌ము), honesty (నిజాయితీ), bravery
(సాహ‌స‌ము), strength (బ‌ల‌ము), wisdom (తెలివి, విజ్ఙానం), darkness (చీక‌టి), brightness (వెలుతురు) 
freedom (స్వేచ్ఛ‌)

2. Action (ప‌ని) : theft (దొంగ‌త‌న‌ము), movement (క‌ద‌లిక‌), laughter (న‌వ్వు), judgement (తీర్పు),
hatred (అస‌హ్యించుకోవ‌డం)

3.State (స్థితి) : childhood (శైశ‌వ‌ము), boyhood (బాల్య‌ము), youth (య‌వ్వ‌న‌ము), slavery
(బానిస‌త్వ‌ము), sleep (నిద్ర‌ ), sickness (అనారోగ్యం), death (మ‌ర‌ణం)